#1Local

Medak · 14 Nov
ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు
ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు
ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు పాపన్నపేట: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ మండపంలో దీపాల ఆకృతిలో దీపాలను వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో భక్తుల్లో భక్తిభావం వెల్లివిరిసింది.
